ఉద్యోగి కుటుంభానికి ఎయిర్‌ ఇండియా చేయూత

Air India helps to the employee's family

03:28 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Air India helps to the employee's family

ముంబై నుండి హైదరాబాద్‌ వెళ్ళాల్సిన ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఎ 1619 విమానం ఇంజన్‌ దగ్గర పరిశీలిస్తూ ఒక్కసారిగా ఇంజన్‌ స్టాట్‌ అయ్యి అక్కడికక్కడే మృతి చెందిన ఎయిర్‌ ఇండియా ఉద్యోగి రవి సుబ్రమణియన్‌ కుటుంభానికి ఎయిర్‌ ఇండియా సంస్థ బాసటగా నిలిచింది.

రవి సుబ్రమణియన్‌ మృతి పట్ల ఎయిర్‌ ఇండియా సంస్థ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎయిర్‌ ఇండియా సంస్థ చైర్మన్‌ అశ్వని లోహాని మాట్లాడుతూ రవి మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ రవి సుబ్రమణియన్‌ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతాయని రవి మృతికి తమ సంస్థలోని ఉద్యోగులందరు రెండు నిమిషాల మౌనం పాటిస్తామని అన్నారు.మృతి చెందిన రవి సుబ్రమణియన్‌ కుటుంబానికి సంతాపం తెలుపుతూ, ఆయన మృతికి ఐదు లక్షల పరిహారం ఇస్తామని, అంతేకాక రవి సుబ్రమణియన్‌ కుటుంబం లోని ఒకరికి ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం కూడా ఇస్తామని అన్నారు.

ఈ ఘటన పై ఇప్పటికే విచారణ జరుపుతున్నామని, సిగ్నల్‌ను అర్ధం చేసుకోవడంలో కాస్త కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చిన విషయం నిజమేనని, పూర్తి విచారణ జరిగాక ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

English summary

Recently an air India cabin crew employee Ravi Subramanian has died unfortunately when co-pilot started the flight engine. Air India announced that they were giving 5 lakh rupes as compensation to his family and job to his family member