ఎయిరిండియా వుమెన్స్‌డే స్పెషల్..

Air India Womens Day Special Flight

04:22 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Air India Womens Day Special Flight

మార్చి 8.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా ఎయిరిండియా ఒక అరుదైన ఫీట్ ను సాధించింది. పూర్తిగా మహిళలతో విమానాన్ని నడిపి ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. పైలట్ నుంచి గ్రౌండ్ సిబ్బంది వరకూ అందరూ మహిళలే ఉన్న ఈ స్పెషల్ నాన్ స్టాప్ ఫ్లైట్ ను దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు నడపడం విశేషం. ప్రపంచంలో పూర్తి మహిళా సిబ్బంది ఇంత సుదూర ప్రాంతం నడిపిన విమానంగా ఇది రికార్డు నెలకొల్పింది. మార్చి 6న ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం 17 గంటల్లో 14,500 కి.మీల దూరం ప్రయాణించింది. కాక్‌పిట్‌ క్రూ, చెకింగ్‌ స్టాఫ్‌, వైద్యులు, కస్టమర్‌ కేర్‌ సిబ్బంది, గ్రౌండ్ టీమ్ ఇలా అందరూ మహిళలతో విమానం నడిపినట్లు ఎయిరిండియా ట్విట్టర్ లో ప్రకటించింది. ఇది చరిత్రాత్మకమని, అందరూ మహిళా సిబ్బందితో సుదీర్ఘ విమానయానమని ఎయిరిండియా సీఎండీ అశ్విని లొహానీ తెలిపారు. కశ్మత బాజ్‌పేయి, శభంగి సింగ్‌ కమాండ్ లో విమానం ఈ ఘనతను సాధించింది. కాగా, ఎయిరిండియాలో 3,800 మంది మహిళా ఉద్యోగులు పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, వైద్యులు, సెక్యురిటీ సిబ్బందిగా పని చేస్తున్నారు.

English summary

Air India on Monday flew the “world’s longest” all-women operated flight in the world. This Air India flight travelled from the national capital Delhi to San Francisco. This flight travelled a distance of around 14,500 kilometres and travelled about 17 hours , was operated as part of International Women’s Day celebrations.