విమానంలో ఇరుక్కుని ఉద్యోగి మృతి

Air India Worker Died By Strucking In Areoplane

03:14 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Air India Worker Died By Strucking In Areoplane

పార్క్‌ చేసి ఉన్న విమానంలో పని చేస్తూ విమానం ఒక్కసారిగా స్టార్ట్‌ కావడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు.

వివరాల్లోకి వెళ్తే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ డొమస్టిక్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియా సంస్ధలో గ్రౌండ్‌ క్రూ టెక్నిషియన్‌గా పని చేస్తున్న రవి సుబ్రమణియన్‌ అనే వ్యక్తి విమానం ఇంజన్‌లో ఇరుక్కుని మృతి చెందాడు.

ముంబై నుండి హైదరాబాద్‌ వెళ్ళాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం ఎ1 619 ను ఎయిర్‌పోర్టులోని 28వ బే వద్ద పార్కు చేసారు. అయితే తన విధిలో భాగంగా బుధవారం రాత్రి 8:45 లకు సుబ్రమణియన్‌ విమానం ఇంజిన్‌ దగ్గర ఇంజన్‌ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా విమానం ఇంజన్‌ స్టార్ట్‌ కావడంతో విమాన ఇంజన్‌ ఫ్యాన్‌లు అతనిని లోపలికి లాగేసుకున్నాయి. దీంతో అతను అక్కడిఅక్కడే మృతిచెందాడు.

ఈ విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. విమానం కో-పైలట్‌ సిగ్నల్స్‌ ను తప్పుగా అర్ధం చేసుకోవడంతో ఇంజన్‌ స్టార్ట్‌ చేసాడని, ఈ ప్రమాదం పై పూర్తి స్ధాయి విచారణ జరిపి భాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్‌ ఇండియా సీఎండీ అశ్వనీ తెహనీ అన్నారు.

English summary

Air India Worker named Ravi Subramanian was died because when he was working at the engine the co-pilot started engine by mis-understanding of the signals