100 కోట్లు దిశగా 'ఎయిర్ లిఫ్ట్'

Air lift towards 100 crores collection

02:40 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Air lift towards 100 crores collection

నిజమైన సంఘటనల ఆధారంగా, నిజాయితీతో కూడిన కధతో అందరికీ స్పూర్తినిచ్చే విధంగా తెరకెక్కిన సినిమా 'ఎయిర్‌ లిఫ్ట్‌'. 2016 లో అతిపెద్ద విజయం సాధించిన సినిమా ఇది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సంపాదిస్తోంది. జనవరి 22న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 12 కోట్ల 35 లక్షలు వసూలు చేసింది. రాజా క్రిష్ణ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే 70 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ సేకరణల గురించి వర్తక విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశాడు.

గణతంత్ర దినోత్సవం ముందే విడుదలైన ఈ సినిమా దేశమంతటా ప్రశంసలు పొందింది. 1990 లో గల్ఫ్‌ యుద్దంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్‌ స్టార్స్‌ అందరూ సోషల్‌ మీడియాలో ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.

English summary

'Air lift' movie running towards 100 crores collection. Akshay Kumar's Air Lift movie is released on 22nd January 2016. This movie got Block Buster Hit response from audience. This movie is directed by Raja Menon.