9రోజుల్లో  'ఎయిర్‌లిఫ్ట్‌' కి  రూ.100 కోట్లు

Airlift Collects 100 Crores In Just Nine Days

09:34 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Airlift Collects 100 Crores In Just Nine Days

అబ్బో ఈ సినిమాకు కలెక్షన్లే, కలెక్షన్లు .... ఏకంగా 9 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు ... అదేనండీ,బాలీవుడ్‌ నటులు అక్షయ్‌కుమార్‌, నిమ్రత్‌ కౌర్‌లు నటించిన 'ఎయిర్‌లిఫ్ట్‌' చిత్రం సాధించిన ఘన విజయం ఇది. 9 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించి పెట్టింది. కువైట్‌లో జరిగిన ఉగ్రదాడిలో చిక్కుకున్న 170,000 మంది భారతీయులనివిమానాల్లో తరలించి ఎలా రక్షించారు? అన్న నిజ జీవిత ఘటనల ఆధారంగా రాజాకృష్ణ మేనన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిం చిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు జనవరి 22న రూ.12.35కోట్లు, రెండో రోజు రూ.14.60 కోట్లు వసూళ్లు రాబట్టింది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్లకు దగ్గరగా వసూళ్లు సాధించిందని సినీవిశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్‌లో చేరిన అక్షయ్‌ చిత్రాల్లో ఇది నాలుగోది కావడం విశేషం. భారత్‌లోనే కాకుండా విడుదలైన ఇతర దేశాల్లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ప్రేక్షకులనే కాకుండా సినీవిమర్శకులనూ కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది.

English summary

Bollywood Top Hero Akshay Kumar's New movie "Airlift" was super hit at the Box Office.This movie collected 100 crores of collections in Just 9 Days.