పైలెట్‌కి నచ్చలేదట...విమానం నుండి గెంటేశారు

AirLines Staff Worst Behaviour On Passengers

09:56 AM ON 21st January, 2016 By Mirchi Vilas

AirLines Staff Worst Behaviour On Passengers

ఇదెక్కడి చోద్యమండీ బాబూ, టికెట్ కొనకపోతే దించేయాలి కానీ , పైలట్‌కు నచ్చలేదని విమానం నుంచి దించేయడమా! వినడానికే ఇబ్బందిగా వుంటే , పాపం విమానం దిగిపోయిన వారికి ఎంత అవమానం. పైగా మన భారతీయులకు ... ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది.భారత దేశానికి చెందిన ఓ సిక్కును, అతని స్నేహితులైన ముగ్గురు ముస్లింలను విమానం నుంచి దించేశారు. దీన్ని అవమానంగా భావించిన వారు విమాన సిబ్బందిపై 9 మిలియన్‌డాలర్లకు పరువు నష్టం కేసు పెట్టారు. వివరాలలోకి వెళితే, డిసెంబర్ నెలలో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం టొరంటో నుంచి న్యూయార్క్‌ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికుల్లో ఒక సిక్కుతో పాటు బంగ్లాదేశ్‌, అరబ్‌కి చెందిన ముగ్గురు ముస్లింలు ఉన్నారు.

విమానం ఎక్కగానే సిక్కు ప్రయాణికుడు తన స్నేహితుడైన ముస్లిం ప్రయాణికులతో కూర్చుందామనుకుని తోటి ప్రయాణికులని రిక్వెస్ట్‌ చేసి సీటు మార్పించుకుని కూర్చున్నారు.అయితే, కొద్ది సేపటి తర్వాత ఎయిర్‌హోస్టెస్‌ వచ్చి నలుగురినీ కిందకి దిగమంది. ఎందుకు అని అడిగితే మర్యాదగా దిగి గేట్‌ వద్ద వెయిట్‌ చేస్తే, ఆ తర్వాత ఏం చేయాలో సిబ్బందే చెప్తారంటూ కాస్త కఠువుగా మాట్లాడింది. తీరా విషయం ఆరా తీస్తే, వారి జాతి, రంగు ఏమాత్రం పైలట్‌కి, విమాన సిబ్బందికి నచ్చలేదట. అందుకే దింపేసినట్లు తెలిసింది. మరి ఈ నలుగురు ప్రయాణికులూ ఊరుకోలేదు, ఇక కాసుకోమంటూ, అంతా కలిసి ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిపై కోర్టులో 9 మిలియన్‌ డాలర్లకు బుధవారం దావా వేసేసారు.

English summary

Indian Passengers who were travelling to newyork. When they were travelling suddenly Air Hostess came to them and asked them to get out of the flight because that airlines dtaff does not like the color of that Indian Passengers.After that the Indian passengers have been filed a case on them on this incident