రోడ్డుపై పడ్డ విమానం ...

Airplane Falls From Crane In Hyderabad

11:57 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Airplane Falls From Crane In Hyderabad

ఇదో రకమైన వింత ప్రమాదం .. అయితే ఎవరూ ఆసమయంలో లేకపోవడంతో పెను ప్రమాద తప్ప్డింది. బేగంపేటలోని పాత విమానాశ్రయం రోడ్‌లో తృటిలో తప్పిన ఈ ప్రమాదం వివరాల్లోకి వెళ్తే. ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎ-320 విమానాన్ని శిక్షణ కోసం క్రేన్‌తో తరలిస్తుండగా రెయిలింగ్‌ తగిలి అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఈ విమానాన్ని ఇటీవల జరిగిన ఎయిర్‌ షోలో కూడా ప్రదర్శించారు. నిరుపయోగంగా ఉండటంతో క్రేన్‌ సాయంతో ఈ విమానాన్ని శిక్షణావిభాగానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాతవిమానాశ్రయం రహదారి మీదుగా ఈ తెల్లవారుజామున క్రేన్‌ ద్వారా విమానాన్ని తీసుకువెళుతున్న సమయంలో బరువు ఎక్కువ కావడంతో అదుపుతప్పిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి : బ్రహ్మచారిగా ఉండాలనుకుని ఇన్ని పెళ్లిళ్లు...

ఇవి కూడా చదవండి :

కష్టమైనా సరే ఇష్టంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా

కేజ్రీవాల్‌పై బూటు - సిడి విసిరిన యువకుడు

నా దగ్గర డబ్బుల్లేవ్ .. నెల గడవడమే కష్టంగా వుంది

English summary

An Un Used Air India aircraft falls off crane during road transport in Hyderabad. This was occurred in Begumpet in Hyderabad.