నోట్ల మార్పిడికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫర్!

Airports authority gave a offer for notes exchange

12:58 PM ON 18th November, 2016 By Mirchi Vilas

Airports authority gave a offer for notes exchange

వారం క్రితం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పలు ఆఫర్లు వస్తున్నాయి కదా. ఇప్పడు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఓ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో నోట్ల మార్పిడిపై భారీ క్యూలు ఉంటుండటంతో నోట్ల మార్పిడికి దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎయిర్ పోర్ట్ ల వద్ద కౌంటర్లు ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏ ప్రైవేట్ బ్యాంకులైనా ముందుకు రావచ్చని పేర్కొంటూ, తాము కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమని, నోట్ల మార్పిడి చేసుకునేందుకు కౌంటర్ స్థలం కూడా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. విమాన ప్రయాణికులు కూడా నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్ ఇచ్చింది. మరి ఏ బ్యాంకులు వినియోగించుకుంటాయో చూడాలి.

English summary

Airports authority gave a offer for notes exchange