ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్!

Airtel bumper offer

12:42 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Airtel bumper offer

ఇది పండగల సీజన్ కనుక డేటా యూజర్లకు కూడా పండగే పండగ. ప్రస్తుతం కృష్ణాష్టమి ముగిసి, వినాయక చవితి వస్తోంది. ఆతర్వాత దసరా పండుగ... అందుకే యూజర్లకు ఆఫర్లు ఇవ్వడానికి టెలికాం కంపెనీలు పెద్ద యుద్ధం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, 4జీ టెక్నాలజీ సబ్ స్క్రైబర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి. పోటాపోటీగా డేటా రేట్లు తగ్గిస్తున్నాయి. కొత్త సబ్ స్క్రైబర్లను ఆకర్షించేందుకు తాజాగా ఎయిర్ టెల్ సంచలనాత్మక ఆఫర్ ను ప్రకటించింది. రూ. 250కే 10 జీబీ డేటా ఇస్తామని పేర్కొంది. జే సిరీస్ స్యామ్ సంగ్ ఫోన్ ను కొనేవాళ్ళకు 1 జీబీ ధరకే 10 జీబీ 4జీ డేటాను ఇస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది.

ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న ఎయిర్ టెల్ యూజర్లు, కాబోయే యూజర్లు కూడా వినియోగించుకోవచ్చునని అంటోంది. 4జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో 3జీ డేటా పొందవచ్చని చెబుతోంది. ఇక మిగిలిన కంపెనీలు కూడా ఆఫర్ల మేళాకు సన్నద్ధం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: హిమాచల్ ప్రదేశ్ లో 3సార్లు భూప్రకంపనలు

ఇది కూడా చదవండి: టీచర్ చెంప చెల్లుమనిపించాడు.. ఆపై...

ఇది కూడా చదవండి: ప్రిన్స్ కోసం ఆ స్టార్ హీరోకి నో చెప్పేసింది...

English summary

Airtel bumper offer