ఏడాది పాటు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

Airtel Launches New 4G Plan

11:25 AM ON 4th January, 2017 By Mirchi Vilas

Airtel Launches New 4G Plan

రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం ఆపరేటర్లు దిగివస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఏడాది పాటు 4జీ డేటా అందించనున్నట్లు వెల్లడించింది. 4జీ హ్యాండ్ సెట్లు కలిగి ఎయిర్ టెల్ నెట్ వర్క్ వినియోగించని వారు, అదే విధంగా ఎయిర్ టెల్ నెట్ వర్క్ వినియోగిస్తూ కొత్త 4జీ హ్యాండ్ సెట్లకు అప్ గ్రేడ్ అయిన వారికి ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. 4 జనవరి 2017 నుంచి 2017 ఫిబ్రవరి 28 మధ్య ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఇక ఈ ఆఫర్ కింద వినియోగదారులు ప్రతి నెలా 3జీబీ ఉచిత డేటాను 31 డిసెంబర్ , 2017 వరకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ ప్యాక్ ల ద్వారా పొందవచ్చని తెలిపింది. ‘4జీ అనుభూతిని ఏడాది పాటు ఆనందించేందుకు వినియోగదారులకు స్వాగతం పలుకుతున్నాం. దేశవ్యాప్తంగా 4జీ హ్యాండ్ సెట్ల వినియోగం పెరుగుతోంది. ఎక్కువమంది వేగవంతమైన బ్రాండ్ సేవలను అందిపుచ్చుకునేందుకు ఎయిర్ టెల్ ఈ ఆకర్షణీయ పథకం అందిస్తోంది’ అని భారతీ ఎయిర్ టెల్ డైరెక్టర్ మార్కెటింగ్ ఆపరేషన్స్ అజయ్ పూరి వెల్లడించారు.

ఉదాహరణకు 4జీ హ్యాండ్ సెట్లు కలిగిన ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.345తో రీఛార్జ్ చేసుకుంటే ఈ పథకం కిందకు వస్తారు. రూ.345 రీఛార్జ్ తో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత లోకల్ , ఎస్టీడీ కాల్స్ 4జీబీ(1జీబీ రెగ్యులర్ ప్యాక్ బెనిఫిట్ ప్లస్ 3జీబీ ఉచిత డేటా)ను ప్రతినెలా పొందవచ్చు. ఇది 28రోజుల పాటు ఉంటుంది. డిసెంబర్ 31 వరకు కేవలం 13 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

పోస్ట్ పెయిడ్ వినియోగదారులు రూ.549 ప్లాన్ కింద అపరిమిత కాల్స్ తో పాటు 6జీబీ(3జీబీ రెగ్యులర్ డేటా ప్లస్ 3జీబీ ఉచిత డేటా) డేటా పొందవచ్చు. రూ.799 ప్లాన్ కింద అపరిమిత కాల్స్ తో పాటు 8జీబీ డేటా(5జీబీ రెగ్యులర్ డేటా ప్లస్ 3జీబీ ఉచిత డేటా) పొందవచ్చు.

ఇవి కూడా చదవండి: ఆరు అంగుళాల అస్థిపంజరం.. ఇది ఎవరిదో తెలుసా

ఇవి కూడా చదవండి:కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

English summary

Reliance Jio Network have been created sensation in All Over India by launching free unlimited data and calls and it also grab leading position in Telecom Technology. Noe Airtel have launched new plans and data offers to give counter to JIo Network.