మరో బంపరాఫర్ ఇస్తున్న ఎయిర్ టెల్

Airtel Special Offers 10 GB data for just Rs. 259

11:28 AM ON 20th October, 2016 By Mirchi Vilas

Airtel Special Offers 10 GB data for just Rs. 259

పోటీ ప్రభావమో ఏమో గానీ వినియోగదారులకు మేలు కలిగేలా టెలికం కంపెనీలు ఆఫర్ లమీద ఆఫర్లు దంచేస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో ప్రభావం కూడా ఎక్కువే ఉండడంతో తమ మనుగడ కోసం. టెలికం సంస్థలు దెబ్బకు దిగొస్తున్నాయి. ఇప్పటికే టారిఫ్ ప్లాన్లను బాగా తగ్గించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థలు జియోతో పోటిపడుతున్నాయి. తాజాగా మార్కెట్ పోటీని తట్టుకునేందుకు భారతి ఎయిర్ టెల్ బుధవారం మరో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. కొత్తగా కొనుగోలు చేసే ఏ 4జీ మొబైల్ కైనా రూ.259తో 10 జీబీ డాటాను ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే 1 జీబీ కేవలం రూ.25కే అన్నమాట. భారతదేశమంతటా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రీచార్జ్ చేసిన వెంటనే 1 జీబీ వినియోగదారుడి ఖాతాలో చేరుతుంది. మిగతా 9 జీబీల డాటాను ‘మై ఎయిర్ టెల్’ యాప్ ద్వారా పొందవచ్చు. కొత్త వినియోగదారులు మూడు నెలల వ్యవధిలో గరిష్టంగా మూడుసార్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ఆగస్టులో ఈ ఆఫర్ ను కేవలం సామ్ సంగ్ గెలాక్సీ జె సిరీస్ ఫోన్ల కొన్నవారికి మాత్రమే పరిమితం చేయగా ఇప్పుడు అన్ని ఫోన్లకు వర్తింపజేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో ప్రారంభించిన ఈ ఆఫర్ ను ఇప్పుడు దేశమంతా విస్తరించింది. కాగా వొడాఫోన్ కూడా ఇప్పటికే ఇటువంటి ఆఫర్ నే ప్రకటించింది. ఎంపిక చేసిన మెట్రోపాలిటిన్ నగరాల్లో 4జీ మొబైల్ కొన్న కొత్త వినియోగదారులకు 1జీబీ డాటా రేటుకే 10జీబీని అందిస్తోంది. దీపావళి పండుగ నేపథ్యంలో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: అమ్మవారిని 5వ రోజు స్కందమాతగా ఎందుకు కొలుస్తారు?

ఇది కూడా చూడండి: వధూవరులు పెళ్ళిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?

ఇది కూడా చూడండి: నాగదోషం ఉన్నవాళ్లు.. పెళ్లి ఆలస్యం అవుతున్న ఆడవాళ్లు దర్శించవల్సిన ఆలయం

English summary

Airtel Special Offers 10 GB data for just Rs. 259.