ఎయిర్‌టెల్ నుంచి వింక్ యాప్

Airtel's Wynk Games App

06:09 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Airtel's Wynk Games App

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త గేమ్స్ యాప్‌ను విడుదల చేసింది. వింక్ గేమ్స్ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వింక్.ఇన్ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఇప్పటికే వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్ పేరిట పాటలు, సినిమాల యాప్‌లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు గేమింగ్ ప్రియుల కోసం ఈ యాప్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రస్తుతం దాదాపు 2వేలకు పైగా వివిధ విభాగాలకు చెందిన గేమ్స్ లభిస్తున్నాయి. పలు ప్రీమియం గేమ్స్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. క్రికెట్, స్పోర్ట్స్, రేసింగ్, అడ్వెంచర్, కార్డ్స్, కిడ్స్, పజిల్స్ తదితర గేమ్స్‌ను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లకు ఈ గేమ్స్ ఉచితంగా లభిస్తుండగా, నాన్ ఎయిర్‌టెల్ యూజర్లు రూ.29 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

English summary

FamousTelecom Network Airtel Wynk Games Subscription Service Launched With Over 2,000 Titles