చెన్నైలో ఉచిత టెలికాం సర్వీసులు

Airtel,Vodafone Offers Free Talktime To Chennai Flood Victims

11:43 AM ON 3rd December, 2015 By Mirchi Vilas

Airtel,Vodafone Offers Free Talktime To Chennai Flood Victims

చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. వరదల్లో చిక్కుకున్న వారికి బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంభందాలు తెగిపోయాయి. చాలామంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. తమ వారితో మాట్లాడదామంటే బయటకు రాలేని స్థితి, చెన్నైలో మొత్తం దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. చెన్నై ఎయిర్‌ పోర్టు, రైల్వే స్టేషన్‌ ఇలా ఒకటేమిటి అన్నీ మూతపడ్డాయి. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా చెన్నై వరద భాదితులకు సాయం చేస్తూనే ఉన్నారు.

వీరితో కొత్త గా భారతీయ టెలికామ్‌ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ వారుకూడా తమ వినియోగదారులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చింది . ఎయిర్‌టెల్‌ సంస్థ చెన్నై లోని తమ ప్రీపెయిడ్‌ వినియోగదారుకు ఉచితంగా 30 రూపాయల టాక్‌టైంను అందిస్తుంది.

అంతేకాక ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఉచితంగా ఎయిర్‌టెల్‌ నుండి ఇతర ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు 10 నిమిషాలను రెండు రోజుల వ్యాలిడిటిలో అందిస్తుంది. ప్రిపెయిడ్‌ వినియోగదారులకు ఉచితంగా 50 ఎంబీ ఇంటర్నెట్‌ డేటాను అందిస్తుంది.

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లను తమ బిల్లును చెల్లించే గడువును కుడా పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఎయిర్‌టెల్‌ వారి ప్రయత్నాన్ని చూసి తాము కూడా ఎదో ఒకటి చెయ్యాలని వొడాఫోన్‌ సంస్థ వారు కూడా చెన్నై వరద భాదితులకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చింది. చెన్నైలోని తమ వొడాఫోన్‌ వినియోగదారులకు ఉచితంగా 10 రూపాయల టాక్‌టైం తో పాటు 10 వొడాఫోన్‌ టూ వొడాఫోన్‌ నిమిషాలు,100 ఎంబీ ఉచిత ఇంటర్నేట్‌ డేటాను అందిస్తుంది. తమ ప్రిపెయిడ్‌ కస్టమర్లకు నెలవారి బిల్లును చెల్లించే కాల వ్యవధి పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇలా ఎయిర్‌టెల్‌ వొడాఫోన్‌ వంటి సంస్థలు తమ వినియోగదారులకు తమ వంతు సహాయం చేస్తుండం అభినందనీయం. ఇతర ఆపరేటర్లు కూడా ఇలా తమవంతు సహాయం చెయ్యాలని కోరుకుందాం.

English summary

The rains in chennai was causd floods and disturbed normal life of the chennai people. So many services were stopped due to this rain affect in chennai and its surrounding regions. India's biggest telecom providers Airtel and Vodafone mobile operators were giving free talktime and free internet data to their users