విజయానికి కారణాలు ఆ రెండే

Aishwarya Rai About Her Success Secret

11:11 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Aishwarya Rai About Her Success Secret

అందం..అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ 42 ఏళ్ల వయస్సులోనూ తన వన్నె తగ్గలేదు. ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఐశ్వర్య తెలుగు. తమిళం.. బెంగాలీ వంటి పలు ప్రాంతీయ చిత్రాలతో పాటు.. హాలీవుడ్‌లోనూ నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. అయితే.. ఇన్ని రకాల చిత్రాల్లో నటించడానికి భాష.. ప్రాంతం అన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడమే కారణంగా ఆమె చెప్పుకొచ్చింది. ‘ఓ అర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తూ సినీ పరిశ్రమలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నా. ప్రాంతీయ భేదం లేకుండా ఏ భాషలో చిత్రం నిర్మించినా అందులో నటించడాన్ని ఆస్వాదిస్తా. సినిమాని సినిమాగానే ఎంజయ్‌ చేస్తా. నేను ఎప్పుడూ సినిమా ఏ స్థాయిలో తీస్తున్నారన్న విషయంలో అయోమయానికి గురికాను. అందుకే నాకు దక్షిణాదిన..హిందీ సినిమాల్లో.. బెంగాలీలో.. హాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. సినిమా ఎంపికలో నేను రెండే అంశాలు దృష్టిలో పెట్టుకుంటా. ఒకటి కథ బాగుండాలి. రెండు నా షెడ్యూల్‌కు తగిన విధంగా పని ఉండాలి. అంతకు మించి సినిమా విషయంలో ఇంకేమీ ఆలోచించను" అని ఐష్ చెప్పుకొచ్చింది. దటీజ్ ఐష్ అని అభిమానులు కొలుస్తారు అందుకే.

ఇవి కూడా చదవండి:

అవార్డు సొమ్ము హాస్పిటల్ కిచ్చేసిన క్రిష్

మహేష్ బాబు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

మెగా రెమ్యూనరేషన్ 30 కోట్లా!!

English summary

Heroine Aishwarya Rai says that she was acted in Many languages and she says that she will enjoy when she was doing movie in any language. She says that the Story Of the film has to be good and it should be be scheduled .