కేన్స్ ఉత్సవంలో బంగారు గౌను లో మెరిసిన ఐష్

Aishwarya Rai At Cannes Festival 2016

12:14 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Aishwarya Rai At Cannes Festival 2016

42ఏళ్ల ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఈసారి ఐశ్వర్యరాయ్‌ పసిడి కాంతిలో మెరిసింది. కేన్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో శుక్రవారం రాత్రి ఐశ్వర్య బంగారు వర్ణం గౌనులో సందడి చేస్తూ, అందరినీ ఆకర్షించింది. అందాల తార అద్భుతమైన డ్రెస్‌తో మరింత అందంగా. బంగారు వర్ణంలో మెటాలిక్‌షీత్‌లో మిరుమిట్లు గొలిపే గోల్డ్‌ కేప్‌ గౌన్‌లో ఎర్రతివాచీపై వయ్యారాలు ఒలకపోస్తుంటే కెమెరాలన్నీ ఇక పక్క చూపులు మానేసి, ఆమెనే బంధించాయి. ఈ డ్రెస్‌ను కువైట్‌కు చెందిన డిజైనర్‌ అలీ యోనిస్‌ రూపొందించారు. ప్రఖ్యాత కాస్మోటిక్‌ సంస్థ లోరియల్‌ పారిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఐశ్వర్య ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ ఉత్సవాల్లో పాల్గొనడం ఇది 15వ సారి.
శుక్రవారం కేన్స్‌లో జరిగిన స్లాక్‌ బే చిత్ర ప్రీమియర్‌ షోకు హాజరయిన ఐశ్వర్యరాయ్‌ శనివారం కూడా ఐష్‌ కేన్స్‌లో అలరించనుంది. కేన్స్‌లో ఈసారి ఆమె నటించిన ‘సరబ్‌జిత్‌’ సినిమా స్క్రీనింగ్‌ జరగనుంది. గతంలో కూడా కేన్స్‌లో ఐశ్వర్య ఎర్రతివాచీ నడకపై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఈసారి ఐశ్వర్య ఎలా కనిపిస్తుందో చూడాలి. అని ఆత్రుతగా ఎదురుచూసే వారు ఉన్నారు. కట్టిపడేసే అందంతో.. అంతే అందమైన వస్త్రధారణతో ఐశ్వర్య ప్రతిసారీ ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఆమెకు భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి: భర్తను కిరోసిన్‌ పోసి తగులబెట్టేసింది

ఇవి కూడా చదవండి: 'కబాలి' ని కొనలేక చేతులెత్తేసిన దిల్ రాజు

1/5 Pages

English summary

Bollywood Beauty Aishwarya Rai bachchan attended to Cannes Festival 2016 in a Gold gown. Aishwarya Rai's Sabarjeet Movie was going to be screened at Cannes Festival This Year.