ఆంటీ అయితేనేం  క్రేజ్ తగ్గలేదు

Aishwarya Rai Attracts Everyone At Cannes Festival

10:08 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Aishwarya Rai Attracts Everyone At Cannes Festival

అందాల తార , బాలీవుడు రాణి ఐశ్వర్య రాయ్ 42ఏళ్ల వయసులోనూ అందానికి ఎక్కడా ఢోకా లేకుండా పోతోంది. వయసు పెరిగేకొద్దీ హీరోయిన్లు ఫేడౌట్ అవుతుండటం మామూలే. 30ఏళ్లు పైబడితే ఆల్ మోస్ట్ నిల్. అయితే ఇందుకు భిన్నంగా ఐష్ హవా నడుస్తోంది.

ఈ ఏడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యాయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. మెటాలిక్ ఎంబాలిష్‌డ్ గౌనులో.. ఈ నీలికళ్ల సుందరి ని చూసిన వారెవ్వరూ కూడా చూపు పక్కకు తిప్పనే లేదట. అదీ ఆమె అందానికున్న చరిష్మా ... ఇక ఐశ్వర్య ధరించిన ఈ డ్రెస్ ను.. కువైట్ కు చెందిన డిజైనర్ డిజైన్ చేశారు. పనిలో పనిగా మా లూట్ అనే సినిమాకు హాజరైన ఐశ్వర్య అక్కడ కూడా తన అందంతో కొన్ని క్షణాల పాటు అందర్నీ ఆపేసింది. అన్నట్టు ఈ కేన్స్ ఫెస్టివల్ కు.. ఐశ్వర్య కూతురు ఆరాధ్యను కూడా తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి:బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ వద్దన్నందుకు భర్త వేళ్లను కోసేసింది

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవానికి సెన్సార్ ఒకే

English summary

Bollywood Glamorous Heroine Aishwarya Rai Bachchan was presently acted Sabarjeeth movie. Recently she attracts everyone at Cannes Festival At the age of 42. She looks Quite beautiful and she Attracts every one there in the festival.