తన బాడీగార్డ్‌ పెళ్లిలో బాలీవుడ్ క్వీన్‌!!

Aishwarya Rai Bachchan went to her bodyguard marriage

04:21 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Aishwarya Rai Bachchan went to her bodyguard marriage

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తన బాడీగార్డ్‌ పెళ్లికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకలో ఐశ్వర్యబచ్చన్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బంగారు రంగు బోర్డర్‌లో ఎరుపురంగు అనార్కలి డ్రెస్‌లో ఐశ్వర్య చాలా అందంగా కనిపించింది. ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఐశ్వర్యరాయ్‌ ఏ మాత్రం ఒక సెలబ్రిటీలా కాకుండా ఒక సామాన్య వ్యక్తిలా తను ప్రవర్తించింది. తన బాడీగార్డ్‌ కుటుంబంతో కాసేపు ముచ్చటించి వధూవరులు ఇద్దరితో ఫోటోలకు పోజు ఇచ్చింది. ఇది చూసిన వధూవరులు బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అంత పెద్ద స్టార్‌ ఇంత సింపుల్‌గా నడుచుకోవడం చాలా గొప్ప వ్యక్తిత్వంగా భావించారు అందరూ. ఐశ్వర్యరాయ్‌ చాలా కాలం తరువాత సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో జజ్భా చిత్రంలో నటించింది, అది అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో కరణ్‌ జోహార్ దర్శకత్వంలో 'ఎ దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంలో నటిస్తుంది.

English summary

Aishwarya Rai Bachchan went to her bodyguard marriage on sunday December 6th.