ఐష్ కుటుంబానికి అవమానం - తగిలిన దెబ్బలు

Aishwarya Rai Daughter And Mother Gets Hurt In Airport

11:37 AM ON 25th July, 2016 By Mirchi Vilas

Aishwarya Rai Daughter And Mother Gets Hurt In Airport

స్టార్ హీరోలు ,హీరోయిన్లకు వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు ... వాళ్లకు వుండే ఫాలోయింగ్ అలాంటిది. కొన్ని చోట్ల అభిమానం హద్దులు కూడా దాటుతుంది. అది తీరని అవమానం మిగులుస్తుంది. అందుకే మరి సెలబ్రెటీలు పబ్లిక్ లోకి వెళ్లాలంటే అంతగా భయపడేది. చుట్టూ బాడీ గార్డులు. బౌన్సర్లు ఉంటే తప్ప సెలబ్రెటీలు జనాల్లోకి వెళ్లరు. అలా వెళ్లినా కూడా కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఐశ్వర్యాయ్ విషయంలో అదే జరిగింది. లండన్ నుంచి తన తల్లి వృందా రాయ్, కూతురు ఆరాధ్యతో కలిసి ముంబయికి వచ్చిన ఆమెకు ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అభిమానులు, ఫొటోగ్రాఫర్ల తాకిడితో ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఐశ్వర్య తల్లి కింద పడిపోయి గాయాలు కూడా అయ్యాయి. దీంతో అక్కడున్న వాళ్ల మీద ఐష్ ఆగ్రహంతో ఊగిపోయింది

ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తుండగా ఐశ్వర్యను చూడ్డానికి కొందరు అభిమానులు ఎగబడ్డారు. మరోవైపు ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫొటో తీయడానికి పోటీ పడ్డారు. ఐతే వారి నుంచి ఐశ్వర్యను తప్పించి కారు ఎక్కించబోతుండగా అనుకోని సంఘటన జరిగింది. బాడీగార్డు ఓ ఫొటోగ్రాఫర్ ను బలంగా నెట్టడంతో అతను ఐశ్వర్యా రాయ్ తల్లి మీద పడ్డాడు. దీంతో ఆమె అదుపు తప్పి కిందపడిపోయారు. అప్పటికే ఆరాధ్యను కార్లో కూర్చోబెట్టి తాను కూర్చోబోతుండగా తల్లి అరుపు వినిపంచి.. ఐష్ కంగారు పడింది. ఆ కంగారులో ఒక్క ఉదుటున బయటికి వచ్చిడోర్ వేయగా, అది ఆరాధ్యకు తగిలింది. తను ఏడవడం మొదలుపెట్టింది. ఓ వైపు అమ్మ బాధ, మరోవైపు కూతురు ఏడుపు.. దీంతో తీవ్ర ఆవేదను గురైన ఐశ్వర్య ఎందుకిలా అయ్యిందంటూ అక్కడున్న వాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ గొడవంతా చూసి ఫొటోగ్రాఫర్లు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకున్నారు.

English summary

Aishwarya Rai Daughter And Mother Gets Hurt In Airport.