ఐశ్వర్య కేరాఫ్ గుంటూరు జిల్లా

Aishwarya rai photo on ntr health card

05:07 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Aishwarya rai photo on ntr health card

అధికారుల నిర్లక్ష్యం వల్ల బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ కేరాఫ్ గుంటూరు జిల్లాగా మారింది. దీన్ని బట్టి వారి పనితీరు ఏ రీతిలో ఉందో అందరికీ అవగతమై ఉంటుంది. హెల్త్‌ కార్డులు జారీ లో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఐశ్వర్యరాయ్‌ కేరాప్‌ గుంటూరు జిల్లాగా మారడం జరిగింది.

అసలు కధనంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎన్టీఆర్‌ హెల్త్‌ కార్డుల జారీ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని నిరుపేదల కోసం ఈ పధకాన్ని ప్రాంభించారు. నిరుపేదప్రజలకు ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్య సేవల పేరిట ఈ కార్డులను మంజూరు చేస్తుంది. అయితే ఈ హెల్త్‌ కార్డులో లబ్దిదారుల చిత్రానికి బదులుగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిన ఐశ్వర్యరాయ్‌ చిత్రాన్ని పెట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా, గొల్లపల్లి మండలంలో గంగుపల్లి తాండాకు సంబంధించిన బాణావత్‌ బాద్యు కు వేరొక పేరుతో హెల్త్‌ కార్డు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కార్డులో వారి పేర్లు ఉన్నప్పటికీ, వారి ఫ్యామిలీ చిత్రం మాత్రం లేదు. ఆ స్థానంలో బాలీవుడ్‌ నటి చిత్రాన్ని అమర్చారు ఆ అధికారులు. దీంతో ఆ లబ్ధిదారులు వారి ఫ్యామిలీ ఫోటోకి బదులుగా ఐశ్వర్యరాయ్‌ ఫోటో చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆగ్రహం చెంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారితోపాటు అక్కడ స్థానికులు కూడా మండి పడ్డారు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే సినీ తారల చిత్రాలను పెడతారు అంటూ ఆగ్రహం వ్వక్తం చేసారు.

English summary

Aishwarya rai photo on ntr health card. At the time of issuing photo identifications cards, our authorities do many mistakes.The actual beneficiary in Guntur, who deserves his photo to be placed on the health card, got shocked after seeing the image of actress.