దుబాయ్ లో ఐష్ ఇల్లు చూస్తే దిమ్మ తిరుగుద్ది!

Aishwarya Rai villa in Dubai

10:39 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Aishwarya Rai villa in Dubai

ఎంచక్కా నచ్చినోడిని పెళ్ళి చేసుకొని, అందమైన ఇంట్లో హాయిగా గడపాలని ప్రతి అమ్మాయి కూడా కలలు కనడం సహజం. అంతే కాదు ఇల్లు సౌకర్యంగా ఉండాలని, అందరూ మెచ్చుకునేలా ఉండాలని కూడా ఉబలాటపడతారు. విలాస జీవితానికి అలవాటు పడిన వాళ్ళయితే అత్యాధునిక సౌకర్యాలను అమర్చుకుంటూ ఉంటారు. కొందరైతే కేవలం ఇంటినే కాకుండా చుట్టూ ఉండే ప్రదేశాన్ని, దేశాన్ని, అక్కడ ఉన్న సౌకర్యాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక బాలీవుడ్ తారలకైతే హై ఎక్సపెక్టషన్ ఉంటుంది. తారలు ఎక్కువగా దుబాయ్ నే ఇష్టపడుతున్నారు.

విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అక్కడే ఇళ్ళు కొనుక్కుంటున్నారు. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఆ బాటలోనే నడుస్తోంది. ఆమె దుబాయ్ లో అత్యంత విలాసవంతమైన ఇల్లు కొన్నట్లు టాక్ నడుస్తోంది. షేక్ హోల్డింగ్స్ నిర్మించిన 97 విల్లాల సముదాయంలో ఒక విల్లాను ఐశ్వర్య, అభిషేక్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో స్కవోలిని డిజైనర్ కిచెన్, నోల్టే వార్డ్ రోబ్స్ ఉన్నాయి. హోం ఆటోమేషన్ సిస్టమ్, ప్రత్యేక హోటల్ సర్వీస్ కూడా ఉండటం విశేషం. ఈ ప్రాజెక్టులో 18 హోల్ చాంపియన్ షిప్ గోల్ఫ్ కోర్స్ ఉంది. షారూఖ్ ఖాన్ గతంలోనే ఇక్కడ ఓ విలాసవంతమైన విల్లాను కొన్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఇటీవలే అత్యాధునిక విల్లాను సొంతం చేసుకున్నాడని బాలీవుడ్ టాక్.

1/6 Pages

English summary

Aishwarya Rai villa in Dubai