ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా అజయ్ - కాజోల్ !

Ajay Devagan And Kajol As Andhra Pradesh Brand Ambassadors

01:02 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Ajay Devagan And Kajol As Andhra Pradesh Brand Ambassadors

సినీ హీరోలు , రాజకీయ నేతలకు లింకులు సహజమే. పరిస్థితులు అలానే వున్నాయి. ఇక బాలీవుడ్ బడా హీరోల్లో ఒకడైన అజయ్ దేవగన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం భేటీ కావడం ఆసక్తి గా మారింది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో బాబును అజయ్ కలిశారు. వీళ్లిద్దరి మధ్య చాలా సేపు భేటీ సాగింది. తాను - తన భార్య కాజోల్ ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తామని అజయ్ దేవగన్ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి చంద్రబాబు కూడా సంతోషంగా అంగీకరించినట్లు తెలిసింది.

ఇవి కూడా చూడండి: భారత్ లో వాట్సప్ బ్యాన్ !?

ఏపీలో ఎంటర్ టైన్ మెంట్ - మీడియా - క్రియేటివ్ ప్రాజెక్టులు చేపట్టడానికి అజయ్ దేవగన్ ముందుకు వచ్చాడు. దీనికి సంబంధించి తన టీంతో కలిసి అజయ్ ఈ భేటీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. అత్యాధునిక లైడర్ టెక్నాలజీ సహాయంతో భూఉపరితల ఛాయాచిత్రాలు తీసే ప్రాజెక్టును అజయ్ దేవగన్ బృందం ప్రతిపాదించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని ఇరిగేషన్ - కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఉపయోగించవచ్చని సీఎం భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయడానికి చంద్రబాబు అంగీకరించారు. మరి ముంబయికి చెందిన అజయ్ - కాజోల్ లను ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగానూ నియమిస్తారా అన్నది ఆసక్తికరం. ఇప్పటికే సాయికుమార్ విజయవాడ పోలీసు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నేపధ్యంలో అజయ్ దంపతులకూ అవకాశం దక్కవచ్చనే మాట వినవస్తోంది.

ఇవి కూడా చూడండి:

షాకింగ్: ఐష్ ని ముద్దాడిన జర్నలిస్ట్

సర్దార్ పై బాబీ తండ్రి షాకింగ్ కామెంట్స్

ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

English summary

Bollywood Hero Ajay Devagan and Heroine Kajol met Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu. They two were to be appointed as the Brand Ambassadors of Andhra Pradesh Tourism.