బాహుబలి 2 లో బందిపోటు వీరయ్య

Ajay Ghosh As Villain In Bahubali 2

12:15 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Ajay Ghosh As Villain In Bahubali 2

బాహుబలి అనూహ్య విజయంతో దాని సీక్వెల్ బాహుబలి 2’ మూవీ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నటీనటులూ పెరుగుతున్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్న రాజమౌళి ఫస్ట్ పార్ట్‌లో తమన్నా వైపు ఓ రేంజ్‌లో చూపించగా.. ఇప్పుడు అనుష్క వైపు నుంచి స్టోరీని తెరకెక్కిస్తున్నాడట. దేవసేన(అనుష్క) ఉంటున్న ట్రైబల్ విలేజ్‌లో బందిపోటు వీరయ్యగా అజయ్ ఘోష్ కనిపిస్తాడని టాక్. గతంలో ‘ప్రస్థానం’లో పోలీస్ అధికారిగా నటించిన అజయ్ ఘోష్, తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ ఏ స్థాయిలోనూ ఫోకస్ కాలేదు. ఇక ‘జ్యోతిలక్ష్మి’లోనూ నెగిటివ్ రోల్ చేసిన ఏటగాడికి బాహుబలి-2 లోని ఈ రోల్ మాంచి పేరు తెస్తుందట. కేరళ షెడ్యూల్‌లో అజయ్‌ పై వారం రోజులు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. మార్చి నుంచి జరిగే మరో షెడ్యూల్‌లోనూ ఈ నటుడు పాల్గొనున్నాడు. జక్కన్న చేతిలో ఈ విలన్ సరికొత్తగా రూపుదాల్చనున్నాడని చెప్పవచ్చా ?

English summary

Actor Ajay Ghosh who had acted as villian in some of the Telugu films was selected in Bahubali 2. Ajay Ghosh to be acted as "Bandipotu Veerayya" in Bahubali 2