తన సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

Ajay Krishnan commits suicide after watching his debut Movie

04:50 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Ajay Krishnan commits suicide after watching his debut Movie

చాలామంది ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో సినిరంగం లో అడుగుపెడతారు. అలంటి ఎన్నో కలలతో అడుగు పెట్టిన నిర్మాత అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నిర్మాత ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కార‌ణం మరెవరో కాదు అతనే. అసలు విషయం ఏంటంటే తాను నిర్మాత‌గా మారి ఒక చిత్రాన్ని నిర్మించాడు. తన తొలి సినిమా ప్రివ్యూను చూసి, తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

వివరాల్లోకి వెళితే కేర‌ళ‌లోని తిరుముళ్ళవరానికి చెందిన అజయ్ కృష్ణన్ (29) ‘అవరుడే రవుకల్’ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ చిత్రాన్నిరెండు రోజుల క్రితం కొచ్చి లో ప్రివ్యూను చూసాడు. దాంతో అతడికి ఆ సినిమా హిట్ అవ్వడం అసాధ్యమని నిర్ణ‌యానికి వ‌చ్చేసిన అజ‌య్ కృష్ణ‌న్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది

ఇది కూడా చదవండి : పవన్ గొప్పతనం మరోసారి బయటపడింది

అజ‌య్ తన తల్లిదండ్రులకు కూడా ఇదే విష‌యాన్ని చెప్పినట్లు తెలిసింది. అవరుడే రవుకల్ సినిమా కోసం ఆయన రూ.4 కోట్లు ఖర్చు చేశారట, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతుండడం తో ఆత్మ హత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. అవరుడే రవుకల్ సినిమాలో అసిఫ్ అలీ, ఉన్ని ముకుందన్, అజు వర్ఘీస్, వినయ్ ఫోర్ట్, హనీ రోజ్ నటించారు. ఈ చిత్రం విడుదలకావాల్సి ఉంది

ఇది కూడా చదవండి : శ్రీవారి హుండీ దగ్గర లక్ష రూపాయలు కాజేసిన మహిళ

English summary

Ajay Krishnan who recently started a film production house has committed suicide after watching first copy of his yet to be released film.