దటీజ్ అజిత్ దోవల్.. ఇండియన్ జేమ్స్ బాండ్

Ajit Doval is a Indian James Bond

03:19 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Ajit Doval is a Indian James Bond

రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లోనే జేమ్స్ బాండ్ గా పేరుతెచ్చుకున్నారు. శత్రు దేశాలకు, ఉగ్రవాదులకు ఈయనంటే హడల్.. ఆపరేషన్ ఎలా చేయాలో తెల్సిన నేర్పరి. ప్రస్తుత మన దేశ జాతీయ భద్రతా సలహాదారు. వ్యూహాల్లో దిట్ట. ఆయనే అజిత్ దోవల్. ఒకసారి గతంలోకి వెళ్తే, 1988 పంజాబ్ లోని అమృత్ సర్ లోని ప్రార్థనామందిరంలోని ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు ఆపరేషన్ బ్లాక్ థండర్ ను ప్రారంభించాయి. అయితే ఉగ్రవాదులు ఎందరు వున్నారో అంతుబట్టని సమయంలో ఒక ఐపీఎస్ అధికారి రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్లి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతాదళాలకు లొంగిబోయేలా చేసి, రక్తపాతాన్ని నివారించింది ఈయనే.

అంతేకాదు, 1971-99 మధ్య భారత్ లో జరిగిన 15 విమాన హైజాకింగ్ యత్నాలను ఆయన ఆధ్వర్యంలోని భద్రతాదళాలు అడ్డుకొని కుట్రదారుల యత్నాలను భగ్నం చేశాయి. ఇక 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా అధికారం చేపట్టిన వెంటనే అజిత్ దోవల్ ను జాతీయ భద్రతాసలహాదారుగా నియమించారు. ఉత్తరాఖాండ్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి దోవల్. కేరళతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. గతంలో పాక్ లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బందిగా ఏడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన దోవల్, మౌనంగా తనపనిని తాను చేసుకొని వెళ్ళిపోతారు. పాక్ ను ఏకాకి చేసేందుకు అంతర్జాతీయంగా అన్ని యత్నాలు ప్రారంభించారు.

1/2 Pages

సంక్లిష్టసమయాల్లో...

సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి కీలకంగా మారుతున్నాయి. పఠాన్ కోట్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలో వారిని ఏరివేసే యత్నాల్లో వున్న భద్రతాదళాలను సమన్వయపరిచాడు. తాజాగా ఉరీ ఘటన అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదళాల మెరుపుదాడులకు వ్యూహం పన్నినవారిలో దోవల్ కూడా ఒకరు. భారత విదేశాంగ విధానంలో కీలకమార్పులకు నాందిపలుకుతున్న దోవల్ ను ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి తన చాకచక్యం ప్రదర్శించారు.

English summary

Ajit Doval is a Indian James Bond