అజిత్ పొలిటికల్‌ ఎంట్రీ

Ajith Political Entry

11:58 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Ajith Political Entry

స్టార్‌ హీరోలు పాలిటిక్స్‌ లోకి వస్తున్నారంటే చాల అది ఒక సంచలన వార్తగా హల్‌చల్‌ చేస్తుంది. కాగా ఇప్పుడు తమిళనాడు స్టార్‌ హీరో అజిత్‌ బిజెపి పార్టీలో చేరడానికి రంగం సిద్దం అయ్యిందని సమాచారం.

దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి బలం పుంజకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంతోంది. దీని కోసం తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ను చేర్చుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విఫలమైంది. అందువల్ల బిజెపి అదిష్టానం తమిళనాడు స్టార్‌ హీరో అజిత్‌ను సంప్రదించాలని తమిళనాడు బిజెపి వర్గానికి సూచించిందని సమాచారం. అయితే దీనికి హీరో అజిత్‌ కూడా అంగీకరించారనే వార్త తమిళనాడు మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అజిత్‌ బిజెపిలో చేరితే తమిళనాడు లో బిజెపి కి బలం పెరగడం ఖాయం .

English summary

A news came to know that Tamil star hero Thala Ajith to enter in politics.Tamilnadu media saying that he is going to join in BJP party