విజయం మాదేనంటున్న అఖిల్

Akhil Confident About Victory

07:27 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Akhil Confident About Victory

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఆపద సమయం వచ్చినా తారలు క్రికెట్ ఆడి వచ్చిన సొమ్ము సాయంగా అందించడం రివాజు. అదే తరహాలో గతేడాది సీసీఎల్‌ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 100మంది చిన్నారుల శస్త్రచికిత్సకు వినియోగించారు. ఇప్పుడు మళ్ళీ క్రికెట్ మాచ్ జరిపేందుకు ఏర్పాట్లు చేసారు. సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌ అన్నారు. ఉప్పల్‌ మైదానంలో ఆదివారం కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో తెలుగువారియర్స్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మ్యాచ్‌ల ద్వారా సమకూరే మొత్తాన్ని మంచి పనుల కోసం ఉపయోగించటం సంతోషంగా ఉందన్నారు. మరి అఖిల్ సారధ్యం వహించే టీం విజయం సాధిస్తుందా లేదో చూడాలి.

English summary

Hero Akhil who was captaining to Telugu Warriors in Celebrity Cricket League (CCL) says that they will definitely win against Karnataka Bulldozers.This match was going to be held on Uppal Stadium in Hyderabad