నితిన్ కి వార్నింగ్ ఇచ్చిన అఖిల్(వీడియో)

Akhil gave warning to Nithin

12:35 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Akhil gave warning to Nithin

అవును, మీరు విన్నది నిజమే, అఖిల్‌ కి నితిన్‌ మీద కోపం వచ్చింది. ఆ కోపంలో నితిన్‌ గురించి త్రివిక్రమ్‌ కి కంప్లైంట్‌ చేస్తా అని కూడా అంటున్నాడు. అసలు ఎందుకిలా అంటున్నాడో మీకు తెలుసా? వివరాల్లోకి వెళ్తే.. అఖిల్‌ సినిమా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రచారం నిమిత్తం ట్విట్టర్‌లో లైవ్‌గా వచ్చాడు అఖిల్‌. అభిమానులతో ముచ్చటించడానికి #AskAkhil అనే ట్యాగ్‌ లైన్‌తో లైవ్‌ చాట్‌కి సిద్ధం అయ్యాడు. ఫ్యాన్స్‌ ఆ యష్‌ ట్యాగ్‌తో అఖిల్‌కి ప్రశ్న వేస్తే దాన్ని క్వోట్‌ చేసి అఖిల్‌ జవాబు చెప్తాడు. అయితే, మరో వైపు ట్విట్టర్‌లో ఉన్న నితిన్‌ ఊరికే అఖిల్‌ కి ప్రశ్నలు వేస్తూ విసిగిస్తూ వచ్చాడు.

ఇది కూడా చదవండి: శృంగారానికి బానిసైన శ్రీనివాస్‌

మీ నిర్మాత నితిన్‌ ని ఎంత ప్రేమిస్తున్నారు? మీకు హీరోయిన్‌ ఇష్టమా? బ్రహ్మి ఇష్టమా? లాంటి ప్రశ్నలు వేస్తూ మధ్యలో దూరుతున్నాడు. అఖిల్‌ ఫ్యాన్స్‌కి రిప్లై ఇస్తూనే నితిన్‌ కి కూడా రిప్లై ఇస్తూ వచ్చాడు. నితిన్‌ మాత్రం తన అల్లరి ట్వీట్స్‌ మాత్రం ఆపలేదు. మొత్తానికి విసుగు పోయిన అఖిల్‌ నితిన్‌ కి సరదాగా వార్నింగ్‌ ఇచ్చాడు. నువ్వు ఇలాగే నన్ను విసిగిస్తే త్రివిక్రమ్‌ గారికి కంప్లైంట్‌ చేస్తా అని రిప్లై ఇచ్చాడు అఖిల్‌. మరి అవతల త్రివిక్రమ్‌ గారు ఈ కంప్లైంట్‌ వింటారో లేదో ??

ఇది కూడా చదవండి: అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

English summary

Akhil gave warning to Nithin. Akkineni AKhil gave warning to hero Nithin and also gave complaint on Nithin to Trivikram Srinivas.