సమంతాకి పోటీగా అఖిల్‌!

Akhil giving competition to Samantha

12:18 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Akhil giving competition to Samantha

సూపర్‌స్టార్‌ మహేష్‌బూబు సినిమాల్లోనే కాదు యాడ్స్‌లోనూ బాగా మెరుస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు తనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూన్నాడు. ఇదంతా గ్రహించిన సమంత ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ చాలా కంపెనీలకు మహేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండడమే కాదు హీరోయిన్లకు వచ్చే ఆఫర్స్‌ను సైతం తనే తన్నుకుపోతున్నాడని చెప్పింది. ఇందుకు కారణం లేకపోలేదు సౌతిండియా షాపింగ్‌మాల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ముందు సమంతానే వ్యవహరించేది ఆ తరువాత సమంతాని పక్కకు నెట్టి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌ వ్యవహరించాడు. అయితే సమంతాకి పేపర్‌ యాడ్లు మాత్రమే ఉంచారు.

ఇప్పుడు సమంతాకి పోటీగా మరో స్టార్‌ హీరో వచ్చాడు. ఈ ఏడాది దీపావళికి 'అఖిల్‌' సినిమాతో మన ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్‌ ఇప్పుడు సమంతకు పోటీగా వచ్చాడు. ఇప్పటికే బాంబినో, మౌంటెన్‌డ్యూ వంటి బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అఖిల్‌ తాజాగా 'సౌత్‌ ఇండియన్‌ షాపింగ్‌ మాల్'కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. అయితే మహేష్‌ని పక్కకు నెట్టేశారో లేదా అలానే ఉంచారో అన్నది తెలీదు. దీని బట్టి చూస్తుంటే ఇప్పుడు సమంతకి పేపర్‌ యాడ్లు కూడా మిగలినిచ్చేటట్లు లేడు అఖిల్‌. మరి ఇప్పడు సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary

Akhil giving competition to Samantha as a brand ambassador to South India Shopping Mall.