అఖిల్‌ ఫస్ట్‌ లైవ్‌ స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌..

Akhil giving live stage performance in IIFA film awards festival

05:15 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Akhil giving live stage performance in IIFA film awards festival

అక్కినేని నాగార్జున నటవారసుడు అఖిల్‌, 'అఖిల్‌' చిత్రంతో దీపావళికి మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రం జయాపజయాలు పక్కన పెడితే అఖిల్‌ ఈ చిత్రంలో డ్యాన్స్‌, ఫైట్స్‌ ఇరగ దీశాడు. ఇప్పుడు ఇదే పెర్ఫార్మెన్స్‌ని లైవ్‌గా ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నాడు. ఇండియాలో ప్రతీ సంవత్సరం చాలా ఆర్భాటంగా నిర్వహించే ఐఫా అవార్డ్స్‌ వేడుకల్లో అఖిల్‌ స్టేజ్ పై లైవ్‌ పెర్పార్మెన్స్‌ ఇవ్వనున్నాడు. ఈ ఐఫా అవార్డ్స్‌ వేడుక డిసెంబర్‌ 5, 6 వ తేదీలలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేదికకి బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ నుండి ప్రముఖ సినీస్టార్స్‌ రోబోతున్నారు.

ప్రస్తుతం అఖిల్‌ లైవ్‌ స్టేజ్‌ డ్యాన్స్‌ రిహార్సల్స్‌లో ఉన్నాడు, పాపులర్‌ కొరియోగ్రాఫర్స్‌ అఖిల్‌కి డ్యాన్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు.

English summary

Akhil giving live stage performance in IIFA film awards festival. This Festival is going to held on December 4th to 6th.