అఖిల్ కి అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే!

Akhil in latest photoshoot

12:55 PM ON 14th July, 2016 By Mirchi Vilas

Akhil in latest photoshoot

'అఖిల్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని అఖిల్ మొదటి చిత్రమే డిజాస్టర్ అయినా వారసత్వంగా వచ్చిన కొంతమంది అభిమానులతో పాటు, సొంతంగా అభిమానులను సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రెండో సినిమా ఇంకా పట్టాలెక్కనప్పటికీ మోడల్ గా పలు బ్రాండ్స్కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో హైదరాబాద్ బేస్డ్ డిజైనర్ కోసం మరోసారి మోడల్ అవతారం ఎత్తాడు. నాగార్జున ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి డిజైన్ చేసిన ఎథ్నిక్ వేర్ కోసం అఖిల్ మోడల్ గా మారాడు.

ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ధరించి అఖిల్ ప్రత్యేక ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలను అఖిల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా శిల్పా రెడ్డి డిజైన్స్ తనకు సూపర్బ్ గా ఉన్నాయని అఖిల్ పేర్కొన్నాడు. హైదరాబాద్ కి చెందిన శ్రేయా భూపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అఖిల్ కు అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందని ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్లు పెట్టేస్తున్నారు. ఒకసారి అఖిల్ మోడల్ గా వ్యవహరించిన ఆ ఫోటోషూట్ ఫోటోలు పై మీరు ఒక లుక్ వేసేయండి.

1/6 Pages

English summary

Akhil in latest photoshoot