అఖిల్ లవ్ కన్ఫర్మ్ 

Akhil in love with hyderabad girl

11:53 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Akhil in love with hyderabad girl


అక్కినేని నాగార్జునకి లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం, అందుకే ఆయన కూడా లవ్ మ్యారేజ్ ఏ చేసుకున్నారు. చాలా సార్లు తమ కుమారులు లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఎందుకనో నాగ్ కి లవ్ మ్యారేజ్ లంటే ఇష్టం కలుగడం లేదు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య హాట్ హీరోయిన్ సమంతాతో ప్రేమాయణం జరుపుతున్నాడని వస్తున్న వార్తలు నాగ్ ను కలవరపెడుతుంటే... ఇప్పుడు తాజాగా నాగ్ చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ ఓ హైదరాబాద్ అమ్మాయితో డీప్ లవ్ లో ఉన్నాడని ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఆ ఇంగ్లీష్ పత్రిక వాళ్ళు ప్రచురించిన కధనం ప్రకారం, హైదరాబాద్ కి చెందిన ఓ అమ్మాయి అమెరికాలోని న్యూయార్క్ లో చదువుకుంటూ.. ఫ్యాషన్ డిజైనర్ గా ఎదుగుతున్న ఆ అమ్మాయితో అఖిల్ డీప్ లవ్ లో ఉన్నాడట. అయితే ఆ అమ్మాయి ఫ్యామిలీకి, నాగార్జున ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉండడంతో అఖిల్ ఎవరికీ తెలియకుండా ఈ ప్రేమాయణం సాగిస్తున్నాడని సమాచారం. అంతే కాదు ఇలా సీక్రెట్ లవ్ మైంటైన్ చేస్తూ.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలా చేసుకోవాలని అఖిల్ ప్లాన్ అట. దానికి కారణం కూడా లేకపోలేదు, ఎందుకంటే.. ఆ అమ్మాయికి మీడియా పబ్లిసిటీ ఇష్టం లేకపోవడంతో ఆ అమ్మాయి కోరిక మీదట అఖిల్ తన లవ్ ని సీక్రెట్ గా మైంటైన్ చేస్తున్నాడని టాక్. ఎందుకంటే,ఇప్పటికే అన్న నాగ చైతన్య ప్రేమ వ్యవహారంతో నాగ్ తల పట్టుకుంటుంటే, ఇప్పుడు అఖిల్ కూడా షాకిచ్చి నాగ్ కి మరింత తలనొప్పి తెచ్చిపెట్టాడని ఫిలిం వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి నాగ్ అఖిల్ లవ్ కైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
అయితే లవ్ అఫైర్ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.. అవన్నీ రూమర్లేనని అఖిల్ తెలివిగా తోసిపుచ్చాడు. అయితే.. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాని, ఆమె ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా పరిచయం చేయించానని నెమ్మదిగా అసలు విషయం చెప్పాడు. అయితే ఆమె పేరు తదితర వివరాలు తెలిపేందుకు మాత్రం అఖిల్ నిరాకరించాడు. ఇంతకీ ఆమె సెలెబ్రిటీ కాదట. అందుకే తన గర్ల్‌ఫ్రెండ్ వివరాలను గోప్యంగానే దాచాలని తాను అనుకుంటున్నానని అఖిల్ చెబుతున్నాడు.

English summary

Akhil in love with hyderabad girl