మన్మధుడు సీక్వెల్ లో అఖిల్?

Akhil in Manmadhudu sequel

12:40 PM ON 20th August, 2016 By Mirchi Vilas

Akhil in Manmadhudu sequel

అక్కినేని మూడో తరం నటుడు అఖిల్, ఇటీవల 'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకువచ్చాడు. అయితే అది కాస్తా డిజాస్టర్ కావడంతో అక్కినేని అభిమానులకు నిరాశ మిగిలింది. అయినా అఖిల్ తన సెకండ్ మూవీతో హిట్ కొడతాడని ఎదురు చూస్తున్నారు. అయినా ఇప్పటికీ ఈ విషయలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. మొదట వంశీ పైడిపల్లి, ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా అన్నారు. అలాగే అక్కినేని ఫ్యామిలీతో మనం డైరెక్టర్ చేసిన విక్రమ్ కె కుమార్ పేరూ వినిపించింది. ఇక ఇప్పుడు అఖిల్ ఓ సీక్వెల్లో నటించబోతున్నాడు అంటూ కొత్త న్యూస్ వస్తోంది.

నాగార్జున తన 'మన్మధుడు' సినిమాకి అఖిల్ తో సీక్వెల్ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కధ, మాటలు అందించిన 'మన్మధుడు' చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యి నాగార్జునను టాలీవుడ్ మన్మధుడిగా నిలబెట్టింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన మన్మధుడు సీక్వెల్ అఖిల్ సెకండ్ మూవీగా చేస్తే హిట్ పక్కా అని నాగార్జున ఫిక్స్ అయ్యాడట. అందుకే నాగార్జున.. త్రివిక్రమ్ ని ఈ సీక్వెల్ కోసం లైన్ లో పెట్టాడని తెలుస్తోంది.

English summary

Akhil in Manmadhudu sequel