'యే జవాని హై దీవాని' రిమేక్‌లో అఖిల్‌!!

Akhil in Yeh Jawaani Hai Deewani remake

05:54 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Akhil in Yeh Jawaani Hai Deewani remake

అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని అఖిల్‌ 2015 దీపావళికి 'అఖిల్‌' గా మన ముందుకి వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాఫ్‌గా నిలిచింది. ఈ చిత్రం నిరాశ పరచడంతో అభిల్‌ తన రెండో చిత్రానికి ఆచితూచి అడుగుల వేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన 'యే జవాని హై దీవాని' చిత్రం రీమేక్‌లో అఖిల్‌ నటించబోతున్నాడని సమాచారం. వివరాల్లోకెలితే హిందీలో రణబీర్‌కపూర్‌-దీపిక పదుకొనే కలిసి నటించిన ఈ చిత్రంలో అఖిల్‌ అయితే బాగుంటాడని నాగార్జున అభిప్రాయ పడ్డారట. అందుకే వెంటనే ఆ చిత్రం రీమేక్‌ రైట్స్‌ని కొనుక్కోవడానికి ఈ చిత్ర నిర్మాతైన కరణ్‌ జోహార్‌ని కలిశారట.

ఈ రొమాంటిక్‌ డ్రామాలో అఖిల్‌ అయితే కరెక్ట్‌గా ఉంటాడని భావించిన కరణ్‌ జోహార్‌ ఆ రీమేక్‌ రైట్స్‌ని ఇవ్వడమే కాకుండా నాగార్జునతో కలిసి తెలుగులో నిర్మించడానికి సిద్ధమయ్యారట. త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary

Akhil in Yeh Jawaani Hai Deewani remake.