ఐఫాలో 'అఖిల్‌' కి అవమానం!!

Akhil insulted in IIFA awards function

04:14 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Akhil insulted in IIFA awards function

అక్కినేని హీరో అఖిల్‌ తన మొదటి సినిమాతోనే మంచి డ్యాన్సర్ గా పేరు సంపాదించుకున్నాడు. అఖిల్‌ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ, అఖిల్‌ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కీ, యాక్టింగ్ కి మంచి మార్కులే సంపాదించాడు. దీంతో అఖిల్‌ ఐఫాలో చేసే డాన్స్‌ పెర్ఫామెన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావించారు అందరూ. అఖిల్‌ కూడా ఈ లైవ్‌ పెర్ఫామెన్స్‌ కోసం మూడు రోజుల ముందు నుంచీ రిహార్సల్స్‌ చేశాడు. ఎంతో బాగా పెర్ఫామ్‌ చేద్దాం అని అనుకున్నాడు. కానీ వేదిక పై అనుక్నుంత వర్కౌట్‌ అవ్వలేదు. అఖిల్‌ వేదిక పై డ్యాన్స్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోయాడు.

దీంతో అందరూ షాకయ్యారు కానీ ఇందులో అఖిల్‌ తప్పు ఏ మాత్రమూ లేదు. కొన్ని టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల అఖిల్‌ ఆగిపోవాల్సి వచ్చింది. అఖిల్‌ డ్యాన్స్ చేసేటప్పుడు రెండు మూడు పాటలు ఒకేసారి ప్లే అయిపోయాయి. దీంతో స్టెప్పులు కుదరకపోవడంతో అఖిల్‌ ఆగిపోయాడు. వెంటనే తెలుసుకున్న టెక్నికల్‌ సిబ్బంది జరిగిన తప్పును తెలుసుకుని మళ్ళీ అన్నీ సరిచేసి పాటల్ని ప్లే చేశారు. కానీ అప్పుడు కూడా డిస్టర్బెన్స్‌ వచ్చేసింది. దీంతో అఖిల్‌ చాలా నిరాశ చెందాడు. తొలిసారి వేదిక పైన లైవ్‌ డ్యాన్స్ తో అందరినీ మెప్పించాలనుకున్నాడు.

కానీ అఖిల్‌ కి చేదు అనుభవం ఎదురైంది. అఖిల్‌ రెండుసార్లు డిస్టర్బ్ అయినప్పటికీ డ్యాన్స్ చేసినంతసేపూ అదరగొట్టాడని అక్కడున్న ప్రేక్షకులందరూ అనుకున్నారు. సినిమాలో మాత్రమే కాకుండా లైవ్‌ పెర్ఫామెన్స్‌ లో తనకు తానే సాటి అని అందరూ అఖిల్ పై పొగడ్తల వర్షం కురిపించారట. కానీ అఖిల్‌ మాత్రం నిరుత్సాహంగానే ఉన్నాడట.

English summary

Akhil was insulted in IIFA awards function due to some diturbance and techincal problems while he giving live stage performance.