నాగ్ కి కాబోయే చిన్నకోడలు జగన్ బంధువేనట!

Akhil lover Shriya Bhupal is Jagan Mohan Reddy's relative

11:46 AM ON 15th September, 2016 By Mirchi Vilas

Akhil lover Shriya Bhupal is Jagan Mohan Reddy's relative

ఇప్పటికీ టాలీవుడ్ మన్మధుడు, స్టార్ హీరో నాగార్జున త్వరలో మామగారు కాబోతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే తమకు అనువైన జోడీలను సెలెక్ట్ చేసుకోవడంతో, ఇక ఇద్దరు కొడుకులకు త్వరలో ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేసే పనిలో పడ్డాడు. అమ్మాయిలను వెతకాల్సిన అవసరం లేకుండా కొడుకులే పెళ్లికూతుళ్లను సెలెక్ట్ చేసేసుకున్నారని చెబుతున్నారు. పెద్దకొడుకు నాగచైతన్య సమంతను చేసుకుంటాడని, వాళ్లిద్దరూ కలిసిమెలిసి తిరుగుతున్నారని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి కూడా. ఇక నాగార్జున చిన్నకొడుకు సిసింద్రీ స్టార్ అఖిల్ కూడా మూడు ముళ్లు వేయడానికి తొందరపడిపోతున్నా డు.

1/3 Pages

పెళ్లి కళ వచ్చేసిందంటూ జీవీకే రెడ్డి కూతురుకి కూతురు అదేనండీ మనవరాలు శ్రియా భూపాల్ రెడ్డిని అఖిల్ పెళ్లాడబోతున్నాడని వార్తలు వచ్చాయి. అఖిల్ ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేస్తే నాగార్జున కుటుంబానికి జగన్ కుటుంబంతో బంధుత్వం కూడా కలుస్తుందని కొత్త న్యూస్ హల్ చల్ చేస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే గతంలో వైఎస్ తో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆయన వైఎస్ కి చాలా క్లోజ్ అని చెబుతారు. వాళ్ల మధ్య స్నేహబంధమే కాదు బీరకాయ పీచులాంటి బంధుత్వం కూడా ఉందని చెబుతుంటారు. అందుకే చిన్న కోడలి ద్వారా జగన్ తో స్నేహబంధాన్ని బంధుత్వ బంధంగా మార్చుకోబోతున్నాడు నాగ్ అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

English summary

Akhil lover Shriya Bhupal is Jagan Mohan Reddy's relative. Akhil lover and would be Shriya Bhupal Reddy is YSRCP party owner Jagan Mohan Reddy's relative.