అఖిల్ లవర్ ఈ అమ్మాయే!

Akhil loving Shreya Bhupal

12:07 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Akhil loving Shreya Bhupal

అక్కినేని అఖిల్ ఓ హైదరాబాద్ అమ్మాయితో డీప్ లవ్ లో ఉన్నాడని ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించడంతో ఆ అమ్మాయి గురించి మీడియా ఆరా తీయగా ఆ అమ్మాయి పేరు, ఆమె ఫోటోను కూడా ప్రచురించింది. అఖిల్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి పేరు శ్రియా భూపాల్. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షాలిని భూపాల్ కుమార్తె అయిన శ్రియా.. న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసింది. అక్కినేని ఫ్యామిలీతో శ్రియా కుటుంబసభ్యులకు గత 20 సంవత్సరాల పరిచయం ఉంది. అంటే అఖిల్-శ్రియా చిన్ననాటి స్నేహితులని తెలుస్తుంది. ఇప్పుడీ స్నేహం ప్రేమకు దారి తీసింది.

తమ ప్రేమ విషయాన్ని తాజాగా రెండు కుటుంబాలకు చెప్పగా.. వారినుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవ్వలేదని తెలిసింది. అయితే.. అఖిల్-శ్రియా ప్రేమను రెండు కుటుంబాలు అంగీకరించినా ఇంతవరకు ఎంగేజ్మెంట్, పెళ్లి గురించి చర్చలు జరగలేదని తెలిసింది. నాగచైతన్య పెళ్లి అయిపోవడంతోపాటు అఖిల్ రెండో సినిమా రిలీజైన తర్వాత వీరి పెళ్ళిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మొత్తానికి.. అక్కినేని యువహీరోలు వచ్చే ఏడాదిలో ఒకేసారి పెళ్ళిపీటలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary

Akhil loving Shreya Bhupal