అఖిల్ కే ముందు పెళ్లి.. పైగా పెళ్లి ఎక్కడో తెలుసా?

Akhil marriage is doing in Italy

10:34 AM ON 2nd November, 2016 By Mirchi Vilas

Akhil marriage is doing in Italy

మొత్తానికి అక్కినేని నాగ్ కుమారుల పెళ్లి సినిమా తరహాలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు మనం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇస్తున్నారు. అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయని మనందరికీ తెలుసు. దీనికి కారణం నాగార్జున ఇద్దరు తనయులు ప్రేమలో పడడం. ఒకేసారి ఈ విషయం బయటకు పొక్కడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగిన మొత్తానికి పెళ్ళికి పెద్దలు ఓకే చెప్పేసారు. అయితే పెద్ద కొడుకు నాగ చైతన్య కన్నా ముందుగానే చిన్నకొడుకు అఖిల్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ప్రేమలో మునిగితేలుతున్న నాగ్ తనయులు చైతూ, అఖిల్ వివాహవేడుకల్లో అఖిల్ ముందుగా పెళ్లికొడుకు కాబోతుండడం అభిమానులకు శుభవార్తే.

1/5 Pages

చైతూ కన్నా అఖిల్ నిశ్చితార్థం ముందుగా అంటే డిసెంబర్ 9న జరగబోతోంది. శ్రేయాభూపాల్ తో అఖిల్ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారు. ఫ్యాషన్ డిజైనర్ తో అక్కినేని అఖిల్ ప్రేమలో ఉన్నాడు. అయితే నాగార్జున తన చిన్న కుమారుడి వివాహం సింపుల్ గా చేసేద్దామని అనుకున్నాడు. అయితే శ్రేయా కుటుంబీకులు మాత్రం గ్రాండ్ గా చేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. అందుకే ఇటలీలో ఘనంగా పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారని టాక్.

English summary

Akhil marriage is doing in Italy