అఖిల్ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్

Akhil Second Movie Confirmed

10:23 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Akhil Second Movie Confirmed

ఫస్ట్ మూవీ అఖిల్ అచ్చిరాకపోవడంతో, ఇంతకాలం అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటనేదానిపై అనేక రూమర్లు, అనేక కథనాలు హల్ చల్ చేశాయి. వీటన్నిటికీ సమాధానంగా అఖిల్ తన కొత్త సినిమా గురించి స్పందిస్తూ, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. మొత్తానికి తర్వాత సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తికావొచ్చిందని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానని తెలిపాడు. ప్రాజెక్ట్ పూర్తి డీటైల్స్ త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించాడు. హను రాఘవపూడి డైరెక్షన్లో ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేసాడు.

అయితే, సినిమా ఎప్పుడు మొదలౌతుందనే విషయమై అఖిల్ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, ఆగష్టు 29 నాగార్జున బర్త్ డే సందర్భంగా అఖిల్ రెండో సినిమా లాంచ్ చేయబోతున్నారన్నది ఇన్ సైడ్ టాక్. భారీ హైప్ తో వచ్చిన ఫస్ట్ మూవీ 'అఖిల్' బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డంతో అఖిల్ రెండో సినిమాపై అక్కినేని అభిమానులతోపాటు సినీ అభిమానులందరిలోనూ ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో నాని హీరోగా 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' మూవీతో హిట్ కొట్టి మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్ హను రాఘవపూడి, అఖిల్ రెండో సినిమా ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:కరెంటు బిల్ తగ్గించుకోవడానికి కొత్త టెక్నిక్!

ఇవి కూడా చదవండి:సెక్స్ తోనే అవి కంట్రోల్ చేసుకోవచ్చు.. 50 లక్షలు ఇస్తే నేను రెడీ!

English summary

Akkineni Nagarjuna's second son Akkineni Akhil has got flop by the first movie he acted and many rumors came on his second movie but akhil confirmed that he was going to act under the direction of Krishnagadi Veera Premagaadha fame Hanu Raghavapudi.