అఖిల్ - సుక్కూ  సినిమా

Akhil To Act Under Sukumar Direction

11:49 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Akhil To Act Under Sukumar Direction

ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఇది. అఖిల్ అక్కినేని - సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా కు ప్లాన్ అవుతోందట. గతంలో లెక్కల మాష్టార్ గా రాణించిన సుకుమార్ సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఓ శైలి ఎర్పరచుకున్నారు. అందుకే సుక్కూ అంటే అందరికీ గురి. వన్ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ "సుకుమార్ దర్శకత్వంలో మళ్ళీ సినిమా చేసేందుకు ఎప్పుడైనా రెడీ" అంటూ సూపర్ స్టార్ మహేష్ అప్పట్లో ప్రకటించగా, మొన్నటికి మొన్న ఎన్టీఆర్ ఓ వేదిక పై మాట్లాడుతూ సుకుమార్‌తో సినిమా అంటే అది ఓ గౌరవం" అని సుక్కూకి కాంప్లి మెంట్ ఇచ్చేసాడు. ఇక అల్లు అర్జున్‌కి ‘ఆర్య’, నాగచైతన్యకి ‘100% లవ్’ సినిమాలతో బ్రేక్ ఇచ్చింది మన ఈ లెక్కల మాష్టారే. అందుకని సుకుమార్‌తో గనక అఖిల్ సినిమా చేస్తే మనోడు సేఫ్ జోన్ లోకి వచ్చినట్టే నని భావించి ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్. బోయపాటి శ్రీను-బెల్లంకొండ కాంబినేషన్‌లో రానున్న సినిమాతో నిర్మాణ రంగలో అడుగుపెడుతున్న ఈ సంస్థ రెండో సినిమా కోసం సుకుమార్-అఖిల్ కాంబినేషన్‌ని సిద్ధం చేస్తోంది. అఖిల్ - సుకుమార్ కాంబినేషన్ వార్తే సంచలనం అవుతోంది. ఇది సెట్స్ పైకి వెళితే, మరింత హైప్ రావడం ఖాయంగా చెప్పుకుంటున్నారు.

English summary