నాన్నగారిని ఆ సినిమా చెయ్యొదన్నాను

Akhil told that his father to not do that character

12:13 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Akhil told that his father to not do that character

అక్కినేని నాగార్జున-కార్తీ కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం 'ఊపిరి'. మున్నా, బృందావనం, ఎవడు వంటి చిత్రాలు తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. పివిపి సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఫ్రెంచ్‌ చిత్రం 'ద ఇన్‌టచ్‌బుల్స్‌' చిత్రం అధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున పూర్తిగా వీల్‌ చైర్‌కే పరిమితమైన పాత్రలో నటించారు. షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌-ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌ మంచి ఆసక్తి రేకెత్తించగా నిన్న(మార్చి 10) ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తండ్రి- తనయులు అక్కినేని నాగార్జున, అఖిల్‌, నాగ చైతన్య ముఖ్య అతిధిలుగా విచ్చేసి ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ మొదట ఈ కధ విన్నప్పుడు నాన్నగారు వీల్‌చైర్‌లో కూర్చోవడం ఏమిటి చేయవద్దని నాన్నగారితో చెప్పాను. అయితే ఆ తరువాత పూర్తి కధ విన్నాక చాలా బాగుందనిపించింది. 'ఊపిరి' ట్రైలర్‌ చూశాక నాన్నే మా ఊపిరి అనిపించింది. నాన్నగారితో ఇలాంటి చిత్రం తెరకెక్కించిన వంశీ పైడిపల్లి గారికి నాకృతజ్ఞతలు అని అఖిల్‌ అన్నాడు.

ఈ చిత్రం తెలుగు-తమిళం భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. మార్చి 25న ఒకేసారి రెండు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

1/10 Pages

ట్రైలర్:

'ఊపిరి' చిత్రం ట్రైలర్ ఇదే. 

English summary

Akhil told that his father Akkineni Nagarjuna to not do that wheel chair character in Oopiri movie. But after hearing the full script of the movie and I was excited.