మోడీ కార్యక్రమానికి అఖిలేష్ డుమ్మా 

Akhilesh Yadav Absence For Modi Program

03:37 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Akhilesh Yadav Absence For Modi Program

యుపిలో జరిగిన ఓ కీలక కార్యక్రమంలో స్వయంగా ప్రాంధాని నరేంద్ర మోడీ హాజరయితే , ఆ రాష్ట్ర సిఎమ్ అఖిలేష్ యాదవ్ మాత్రం డుమ్మా కొట్టారు. వివరాలలోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలో 14 లైన్ల దిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేకి గురువారం ఉదయం ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్‌గడ్కరీ, మహేష్‌ శర్మలు కూడా హాజరయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. పార్టీలు వేరైనా , అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటిగా ఉండాల్సిన సమయంలో ఇలా ఎందుకు ప్రవర్తించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేంద్రంతో అఖిలేష్ కాలు దువ్వుతున్నట్టేనా ...

కాగా శంఖుస్థాపన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం 1857లో చేసిన మొదటి యుద్ధానికి మీరట్‌ ప్రతీకగా నిలిచిందని గుర్తుచేసారు. కాలుష్యరహిత మార్గంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే రహదారిని నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభివృద్ధితో అనుసంధానం అవ్వాలంటే, గ్రామాలన్నీ మంచి రహదారులతో ఉండాల న్న వాస్తవాన్ని గ్రామస్థులు గ్రహించాలన్నారు.

సహేతుకమైన చర్చలు జరిపి విధానపరమైన మంచి నిర్ణయాలు తీసుకునేందుకే ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్నార న్న వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను కోరారు. ప్రజలు తిరస్కరించిన పార్టీల నేతలు పార్లమెంటును సరిగ్గా పనిచేయనివ్వడం లేదని ఆయన ఈ సందర్భంగా చురక వేసారు.

English summary