మహేష్‌ సినిమాలో పవన్‌ తనయుడు!!

Akhira Nandan in Mahesh Babu film

06:03 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Akhira Nandan in Mahesh Babu film

సూపర్‌స్టార్‌ మహేష్‌ ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో మహేష్‌ కు మంచి హిట్‌ సినిమా ఇచ్చిన డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్‌ బ్రహ్మోత్సవం సినిమా తరువాత మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తనయుడు అఖిరా నందన్‌ చిన్నప్పటి మహేష్‌ పాత్రలో నటించనున్నాడు. గతంలో '1 నేనొెక్కడినే' సినిమాలో మహేష్‌ తనయుడు గౌతమ్‌ చిన్నప్పటి మహేష్‌గా కనిపించాడు. కానీ మురుగదాస్‌ సినిమాలో చిన్నప్పటి మహేష్‌ పాత్రకు గౌతమ్‌ కంటే పెద్దవయసు ఉన్న అబ్బాయ్‌ కావాలి.

దీంతో అఖిరా నందన్‌ ను ఎంపికచేసుకున్నారు. ఎఆర్‌ మురుగదాస్‌ అఖిరా నందన్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం విశేషం.

English summary

Power Star Pawan Kalyan's son Akhira Nandan was acting in a Mahesh Babu-A.R. MuragaDoss movie. Akhira is acting as a child Mahesh Babu in this movie.