రౌండప్ చేసినా భయం లేదన్న సోనాక్షి

Akira movie trailer

12:01 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Akira movie trailer

రౌండప్ చేయకండి... కన్ఫ్యూజన్ లో ఇంకా ఎక్కువ కొట్టేస్తా అంటూ ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇంకా గుర్తుంది కదా... అయితే ఇక్కడ చూస్తే, దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను రూమ్ లోనే ఆమెను కొంతమంది రౌండప్ చేశారు. ఇది కూడా రియల్ లైఫ్ కాదు. రీల్ లైఫ్ లోనే... ఆమె నటించిన 'అకీరా' మూవీ ఇప్పటివరకు పోస్టర్ తో ఆకట్టుకోగా, ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోపే 9 లక్షలకు పైగా హిట్స్ రావడంతో యూనిట్ ఫుల్ ఖుషీ! ఫ్యామిలీ అమ్మాయిగా కనిపించిన సోనాక్షిని ఇందులో డిఫరెంట్ గా చూపించాడు దర్శకుడు.

ఇక బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ రోల్ చేశాడు. ఫాక్స్ స్టార్ సంస్థతో కలిసి డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఐదేళ్ల కిందట తమిళంలో హిట్టయిన 'మౌన గురు' ఇప్పుడు హిందీలో అకీరా పేరుతో రానుంది. అంతా ఓకే అయితే సెప్టెంబర్ సెకండ్ వీక్ లో థియేటర్స్ కు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ మురుగదాస్.

English summary

Akira movie trailer