అప్పట్లో పవన్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Akkada Ammayi Ikkada Abbayi movie collections

10:07 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Akkada Ammayi Ikkada Abbayi movie collections

సినిమాల్లోకి అడుగు పెట్టే ముందు పవన్ ను చూసి అతడి స్నేహితులు కొందరు చిరంజీవి తమ్ముడివి కాబట్టి నీ మీద ఓ యాభై లక్షలు పెట్టి సినిమా తీయొచ్చు.. అది ఓ 70 లక్షలు వసూలు చేయొచ్చు.. అదీ నీ రేంజ్ అన్నట్లు మాట్లాడారట. ఈ మాటలతో చిర్రెత్తుకొచ్చిన పవన్ కళ్యాణ్.. నా స్థాయి ఏంటో నువ్వెలా డిసైడ్ చేస్తావంటూ వాదన పెట్టుకున్నాడట. నేను ఆ మాత్రం కూడా విలువ చేయకపోవచ్చు.. అలాగే ఏ స్థాయికైనా వెళ్లొచ్చు.. అది డిసైడ్ చెయ్యడానికి మీరెవ్వరూ అన్నాడట. అలాంటి పవన్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తొలి రోజే రూ.31 కోట్లు వసూలు చేసే స్తాయికి ఎదిగాడు.

బానే వుంది మరి పవన్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఎవరు ఊహించని విధంగా 4 కోట్లు వసూలు చేసి డెబ్యూ హీరోల్లో సరికొత్త రికార్డ్ నమోదు చేసాడు పవన్.. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమాలో నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్ గా నటించగా.. అక్టోబర్ 11న రిలీజైంది. ఆ రోజునే ఫ్యాన్స్ తమకిష్టమైన రోజుగా భావిస్తూ పవనిజం డేగా సెలబ్రేట్ చేసుకొంటారు.

English summary

Akkada Ammayi Ikkada Abbayi movie collections. Pawan Kalyan debut movie Akkada Ammayi Ikkada Abbayi movie collected 4 crores.