మంచు మనోజ్ మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చిన అఖిల్.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

Akkineni Akhil cute gift Manchu Manoj

01:03 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Akkineni Akhil cute gift Manchu Manoj

అక్కినేని అఖిల్, మంచు మనోజ్ కి ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఇందులోనే ట్విస్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! అసలు విషయంలోకి వెళ్తే.. మంచు మనోజ్-ప్రణీత దంపతుల మొదటి మ్యారేజ్ యానివర్సరీ కానుకగా అక్కినేని అఖిల్ ఓ గిఫ్ట్ ప్రెజంట్ చేశాడు. అయితే అఖిల్ మనోజ్కు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాకవ్వాల్సిందే. అఖిల్ తనకు ఇచ్చిన గిఫ్ట్ ను మనోజ్ తన ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించిన మనోజ్, అఖిల్ కు థ్యాంక్స్ చెపుతూ.. ఆ గిఫ్ట్ ను ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

అఖిల్ తల్లి అమల నటనకే కాదు జంతు ప్రేమకు కూడా అఖిల్ వారసుడవుతున్నాడు. అఖిల్ దగ్గర ఎన్నో అరుదైన జాతుల పెట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటైన అలస్కన్ మాలామ్యూట్ ను మనోజ్ దంపతులకు ప్రెజెంట్ చేశాడు. నీలి కళ్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ బుజ్జి కుక్కపిల్లను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపిన మనోజ్ దానికి జోయా అని పేరు కూడా పెట్టుకున్నాడు. మొత్తానికి అఖిల్ గిఫ్ట్ బాగుంది కదూ..!

English summary

Akkineni Akhil cute gift Manchu Manoj