అఖిల్ పెద్ద శాడిస్ట్ అట!

Akkineni Akhil is a big sadist

11:54 AM ON 12th August, 2016 By Mirchi Vilas

Akkineni Akhil is a big sadist

చాలా మంది తమ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టారు. ముఖ్యంగా సినిమా హీరోలైతే మరింత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఇంక తమలోని లోపాలైతే అసలు బయటకు చెప్పారు. కానీ అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని అఖిల్ మాత్రం అందుకు భిన్నంగా స్వయంగా నేను శాడిస్టుని అని ఒప్పేసుకున్నాడట. తనే స్వయంగా చెప్పడంతో నమ్మక తప్పదు కదా.. అసలు విషయంలోకి వెళితే... తాజాగా హాట్ యాంకర్ అనసూయ హోస్ట్ చేసిన ఓ టాక్ షోలో ఈ విషయాలు బయిటపడ్డాయి. ఆ టాక్ షో పేరు 'ఎ డేట్ విత్ అనసూయ'. యాంకర్ అనసూయ ఈ టాక్ షోను అద్భుతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని రకరకాల ప్రశ్నలతో షోకు తొలి గెస్ట్ అయిన అఖిల్ పై ప్రశ్నలు దాడి చేసింది.

కార్యక్రమంలో అన్నిటికి అఖిల్ నవ్వుతూ సరదాగా, నాటిగా కవ్విస్తూ సమాధానాలు చెప్పాడు. అందులో భాగంగానే తనను చిన్నప్పుడు ఫ్రెండ్స్ శాడిస్ట్ అనేవారిని తేల్చిచెప్పాడు. అఖిల్ మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్ తో తాను బాగా చొరవగా ఉంటానని తన విశ్వరూపం ఏమిటి అన్నది తన స్నేహితులకు మాత్రమే తెలుసునని అందువల్లనే తన స్నేహితులంతా తనను శాడిస్ట్ అని పిలుస్తారని బయటపెట్టాడు. అయితే తన స్నేహితులు ఎవరూ సినిమా రంగంలోకి రాకపోవడంతో తన శాడిస్ట్ టెంపర్ మెంట్ బయటకు రాలేదని తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు. అఖిల్ మరొక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. తనకు హర్రర్ సినిమాలంటే విపరీతమైన భయం అన్నాడు. అందువల్ల కనీసం అలాంటి సినిమాల ట్రైలర్స్ కూడా చూడనని అంటూ తన రహస్యాన్ని బయట పెట్టాడు. అటువంటి కథలు వింటే రాత్రిళ్లు నిద్ర పట్టదని లైటు వేసుకుని పడుకుంటానని తెలిపాడు.

English summary

Akkineni Akhil is a big sadist