మొక్కలు నాటిన అఖిల్

Akkineni Akhil Participated in Haritha Haram Program

10:37 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Akkineni Akhil Participated in Haritha Haram Program

అబ్బో లవ్ చేయడమే కాదు, సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనడం టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కి తెలుసట. అందుకేనేమో రెండో విడత హరిత హారంలో పాల్గొని మొక్కలు నాటాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో నేను సైతం అంటూ భాగస్వామి అయ్యాడు. శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) పోలీసులు శుక్రవారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో అఖిల్ పాల్గొన్నాడు. ఒక చెట్టు ఐదు ఏసీల కంటే ఎక్కువగా గాలిని ఇస్తుందని తన తల్లి అమల తనకు చిన్నప్పుడు చెప్పిందని ఈ సందర్భంగా అఖిల్ అన్నాడు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరాడు. అమల మాదిరి జంతు ప్రేమను కూడా అందిపుచ్చుకున్నాడా లేదా మరి.

ఇవి కూడా చదవండి:జక్కన్న తండ్రితో అజయ్ దేవగన్

ఇవి కూడా చదవండి:'ఆవ్ తుఝే మొగ్ కోర్తా' సింగర్ రెచ్చిపోయింది

English summary

Young Hero Akkineni Akhil participated in Harita Haram Program which was conducting by the Government of Telangana. Akhil said that his mother Amala said that One tree was equal to 5 AC and he said that every one should plant a plant.