అఖిల్ పెళ్లి ఫిక్స్ .. డిసెంబర్ 9న నిశ్చితార్ధం

Akkineni Akhil To Get Engaged On December 9th

10:36 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Akkineni Akhil To Get Engaged On December 9th

మొత్తానికి కొడుకుల లవ్ ఎఫైర్ , పెళ్లి విషయంపై హీరో నాగార్జున పూర్తి క్లారిటీ ఇచ్చేసాడు. కొంతకాలంగా అఖిల్, నాగచైతన్యల పెళ్లిళ్లపై షికార్లు చేసిన పుకార్లకు ఇటీవల పుల్స్టాప్ పెట్టిన నాగార్జున వారి పెళ్లిళ్లపై ఇప్పుడు మరింత క్లారిటీ ఇచ్చాడు. సమంత, నాగచైతన్య, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్, అఖిల్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ వ్యవహారంపై ఇప్పటి వరకు హల్చల్ చేసిన పుకార్లకు నాగ్ అధికారికంగా తెరదించాడు. కుమారుల సంతోషం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదన్న నాగ్, వారు ఎప్పుడంటే అప్పుడు పెళ్లికి సిద్ధమని కూడా ప్రకటించాడు.

ఇక నాగచైతన్య కాబోయే భార్య గురించి కొందరు విలేకరులు ప్రశ్నించగా ‘‘రోజూ మీరు రాస్తున్నారుగా.. ఇంక చెప్పాల్సిన పనేముంది’’ అని నాగ్ అన్నాడు. ఇక డిసెంబరు 9న అఖిల్ నిశ్చితార్థం జరుగుతుందని చెప్పేసాడు. నాగచైతన్య పెళ్లి వచ్చే ఏడాది ఉండొచ్చని సూచించాడు. అఖిల్ కోరిక ప్రకారమే నిశ్చితార్థం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మొత్తానికి అక్కినేని వారింట పెళ్లి బాజా లు మొగడానికి రంగం సిద్ధం అవుతోంది.

ఇది కూడా చూడండి: రాత్రి ఏ దిక్కుకి తల పెట్టుకుని పడుకుంటే మంచిదో తెలుసా?

ఇది కూడా చూడండి: విమానం ఎక్కినప్పుడు ఈ తప్పులు చేస్తే మీరు బుక్కయినట్టే!

ఇది కూడా చూడండి: కొత్తగా పెళ్ళైన వధువు అత్తారింటికి వెళ్ళినప్పుడు ముందుగా కుడికాలే ఎందుకు పెట్టాలి?

English summary

Akkineni nagarjuna younger son Akhil To Get Engaged with Shriya Bhupal On December 9th.