గర్ల్ ఫ్రెండ్ తో మొదటిసారి అడ్డంగా దొరికేసిన అఖిల్(ఫోటోలు)

Akkineni Akhil with his lover Shriya Bhupal

03:13 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Akkineni Akhil with his lover Shriya Bhupal

టాలీవుడ్ లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రేమాయణం కొంత కాలంగా మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఈ మధ్య కాలంలో వార్తలు ప్రచారంలోకి రావడం తెల్సిందే. అఖిల్ కూడా ప్రేమ గురించి, ఒప్పుకోవడమే ఇందుకు కారణం. అఖిల్ తాను ప్రేమలో పడ్డట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆమె వివరాలు బయటకు లీక్ అయ్యాయి. శ్రేయా భూపాల్ అనే డిజైనర్ తో అఖిల్ ప్రేమలో పడ్డాడని, హైదరాబాద్ లోని ఓ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసిపోయింది. ఒకవేళ ఆ వార్తలు అబద్ధం అయితే అఖిల్ మీడియా ముందుకొచ్చి దాన్ని ఖండించేవాడు. కానీ అలా జరుగలేదు. దీంతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది.

1/4 Pages

నాగార్జున కూడా ఈ వార్తలు విని సంతోషం వ్యక్తం చేయడంతో అఖిల్ లవ్ ఎఫైర్ వార్తకు మరింత బలం చేకూరింది. అయితే అఖిల్ ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి తప్ప, ఇప్ప టి వరకు అఖిల్ ఆమెతో కలిసి కనిపించింది లేదు. ఎట్టకేలకు అఖిల్ తన ప్రియురాలితో కలిసి కెమెరాకు చిక్కాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో అఖిల్ తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ప్రియురాలు శ్రేయా భూపాల్ తో కలిసి అఖిల్ తొలిసారి కెమెరాకు చిక్కాడు. నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి, ఎంపి టి.సుబ్బిరామి రెడ్డి చెల్లెలు కొడుకుని వివాహం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలోని ఫోటో ఇది.

English summary

Akkineni Akhil with his lover Shriya Bhupal. Akhil caught with his girlfriend Shriya Bhupal.