అక్కినేని ఫ్యామిలీ భవిష్యత్తు ఫోటో!?

Akkineni family future photo

03:23 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Akkineni family future photo

'మనం' సినిమా తర్వాత గత కొన్ని రోజులుగా అక్కినేని ఫ్యామిలీ పేరు మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక రకరకాల రూమర్లు వస్తున్నాయి.. దీనికి కారణం లేకపోలేదు. ఓ వైపు నాగచైతన్య మరో వైపు అఖిల్ ల లవ్ మ్యాటర్ ఒకదాని వెనుక ఒకటి రావడమే... నాగ చైతన్య సమంతల మధ్య లవ్ పీక్ స్టేజ్ కు వచ్చిందని, చివరకు నాగార్జున కూడా ఒప్పుకున్నాడని, ఇక పెళ్లే తరువాయి అనే వార్తలు వస్తున్న సమయంలో అఖిల్ నేనూ ఓ అమ్మాయిని ప్రేమించా అంటూ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అక్కినేని ఫ్యామిలీ ఒక్కసారిగా మెయిన్ ఫోకస్ లోకి వచ్చేసింది.

చైతూ-సమంతల పెళ్లికి, అఖిల్ కు అతడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి.. నాగ్ ఓకే అనేశారని, ప్రచారం గట్టిగానే నడుస్తోంది. అఖిల్ ప్రేమించిన అమ్మాయి నాగ్ ఫ్యామిలీకి చాలా దగ్గరట.! మొదట నాగచైతన్య, సమంతల మ్యారేజ్ కు కాస్త విముఖంగా ఉన్న నాగ్ తర్వాత ఓకే అన్నారని మరో వార్త.. ఇలా అనేక రూమర్ల నడుమ, ఇదే నాగార్జున ఫ్యామిలీ ఫోటో కాబోతుందంటూ... నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, అఖిల్ అండ్ అఖిల్ ప్రేమించిన అమ్మాయి కలిసున్న ఫోటోను చూపెడుతూ, ఇప్పుడు కొత్త ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. దీనిమీద కామెంట్స్ పడుతున్నాయి.

అభిమానులైతే మురిసిపోతున్నారు. భవిష్యత్తు బాగుండాలనే ఆశిద్దాం...

English summary

Akkineni family future photo